News

కేసీఆర్ క్షమాపణ చెప్పాలి


తెలంగాణ ప్రజా ఫ్రంట్ నేత ఆకుల భూమయ్య సంస్మరణ సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం దారుణమని విరసం నేత వరవరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం నియంతృత్వ ధోరణి విడనాడి ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దుమ్ముగూడెంలో అదుపులోకి తీసుకున్న ప్రజాస్వామిక వేదిక ప్రతినిధులను తక్షణం విడుదల చేయాలని, ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌పై నిజనిర్ధారణకు వెళ్లిన వారిని అడ్డుకోవడం సరికాదని వరవరరావు అన్నారు.